ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో (WTC) ఆడే ఉద్దేశం లేదని ఇండియన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే అంశాన్ని పరిశీలిస్తున్నారా అన్న ప్రశ్నకు పాండ్యా క్లారిటీ ఇచ్చాడు. బాగా సన్నద్ధమై, కష్ట పడి చోటు సంపాదించిన తర్వాతే టెస్టుల్లో పునరాగమనం చేస్తానని చెప్పాడు. ఇప్పటికిప్పుడు వేరొకరి స్థానం తీసుకోవడం అనైతికమవుతుందని హార్దిక్ అభిప్రాయపడ్డాడు.
‘ఇప్పుడే టెస్టు జట్టులోకి రాను. నేను నైతికంగా వ్యవహరిస్తా. టీమ్‌ఇండియా ఫైనల్ చేరడంలో నేను పది శాతం కూడా కష్టపడలేదు. ఒక్క శాతం నా శ్రమ ఉండదు. అలాంటప్పుడు నేను వేరొకరి స్థానాన్ని తీసుకోవడం అనైతికమవుతుంది. నేను టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటే కష్టపడి జట్టులో స్థానం సంపాదిస్తా. అప్పటివరకు నేను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు గానీ, భవిష్యత్తు టెస్టు సిరీస్‌లకు గానీ అందుబాటులో ఉండను’’’ అని హార్దిక్ అన్నాడు.