ఉప్పల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఆఫ్ లైన్ లో లేవు అంటూ ప్రకటన చేశారు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య దసరా రోజున అంటే 12వ తేదీన మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మాట్లాడారు. ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లా మధ్య టీ20 మ్యాచ్ జరుగుతోందని తెలిపారు. కాసేపట్లో ఈ మ్యాచ్ టికెట్ల ఆన్లైన్ లో అందుబాటులోకి వస్తాయని వివరించారు.
పేటీఎం ఇన్ సైడర్ వెబ్ సైట్ /అప్ లో టికెట్ల విక్రయాలు ఉంటాయని చెప్పారు. ఈ టిక్కెట్ల ప్రారంభ ధర రూ.750, గరిష్ఠ ధర రూ.15 వేలుగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు ఉ HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. – ఆఫ్ లైన్ లో టికెట్ల అమ్మకాలు లేవని తెలిపారు. ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు జింఖానా స్టేడియంలో ఫిజికల్ టికెట్ పొందొచ్చు అన్నారు. ఈ నెల 8 నుంచి 12 వరకు ఫిజికల్ టికెట్స్ తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు.