SRH VS KKR IPL 2024.. ‘హార్ట్‌ బ్రేకింగ్ ఫొటో ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఇదే

-

ఐపీఎల్ 17వ సీజన్‌ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ హైదరాబాద్‌-కోల్కతాకు మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్కు చుక్కెదురైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా నిలిచి విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టాస్‌ నెగ్గిన ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్‌ ఎంచుకోగా..ఓపెనర్లు తక్కువ స్కోరుకే పరిమితమై నిరాశపరిచారు. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (55:35 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌) ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా పరుగులు రాబట్టాడు.

త్రిపాఠి మెరుగైన ప్రదర్శన చూపిస్తాడని అంతా భావిస్తున్న సమయంలోనే.. కోల్‌కతా ఆటగాడు ఆండ్రి రస్సెల్ అద్భుత ఫీల్డింగ్‌తో (13.2వ ఓవర్‌ 121 పరుగుల వద్ద) రనౌట్‌ చేయడంతో త్రిపాఠి నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోగా.. డగౌట్‌కు వెళ్లే మార్గంలోనే మెట్లపై కూర్చుండిపోయిన త్రిపాఠి బాధపడుతున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసి ‘ఇదే అత్యంత బాధాకరమైన ఫొటో’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

https://x.com/mufaddal_vohra/status/1792937446956507495

Read more RELATED
Recommended to you

Latest news