శ్రీలంకకు గుడ్‌న్యూస్ చెప్పిన ఐసీసీ.. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటన..

-

శ్రీలంకకు గుడ్‌న్యూస్. శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సి)కి భారీ ఊరట దక్కింది. ఆ దేశ బోర్డుపై విధించిన సస్పెన్షన్ ను ఐసీసీ ఎత్తివేసింది. గత రెండు నెలల నుంచి లంక బోర్డు పరిస్థితులను నిషితంగా పరిశీలించిన ఇంటర్నేషనల్ బాడీ రాజకీయ జోక్యం లేదని నిర్ధారించుకుంది.

ICC lift Sri Lanka Cricket’s ban with immediate effect

గత ఏడాది నవంబర్ 10న సస్పెన్షన్ వేటు వేయడంతో అండర్-19 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను లంక కోల్పోయింది. క్రమంలో 2026 టీ20 వరల్డ్ కప్ రైట్స్ కూడా చేజారుతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు సస్పెన్షన్ తొలగిపోవడంతో లంక బోర్డు యధావిధిగా ఇంటర్నేషనల్ షెడ్యూల్స్ ను మొదలుపెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version