ICC Women’s T20 World Cup 2024: ఇవాల్టి నుంచి మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఐసీసీ మహిళల t20 ప్రపంచ కప్ యూఏఈ వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది ఐసీసీ పాలకమండలి. ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయని ప్రకటించారు. మహిళల టి20 ప్రపంచ కప్ లో భాగంగా తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.

అనంతరం ఇవాళ రెండో మ్యాచ్లో పాకిస్తాన్తో శ్రీలంక జట్టు తలపడనుంది. అటు రేపు సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. రేపే టీమిండియా మ్యాచ్ కూడా ఉంది. రేపు మధ్యాహ్నం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య… మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్ అలాగే డిస్నీ హాట్ స్టార్ యాప్ లలో చూడవచ్చని ప్రకటించారు.