IND vs SL : ఆస్పత్రి పాలైన ఇద్దరు శ్రీలంక క్రికెటర్లు

-

భారత్ తో మూడో వన్డేలో శ్రీలంక ఆటగాళ్లు జాఫ్రా వాండార్సే, అషేన్ బండార తీవ్రంగా గాయపడ్డారు. బౌండరీ ఆపే క్రమంలో ఈ ఇద్దరు ఒకరినొకరు బలంగా ఢీకొట్టారు. ఈ ఊహించని ఘటనతో ఆట కొద్దిసేపు ఆగిపోగా, శ్రీలంక ఆటగాళ్లు నొప్పితో విలవిలలాడుతూ గ్రౌండ్ లోనే పడుకున్నారు.

పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో శ్రీలంక ఫిజియోలకు సాయం భారత ఫిజియోలు కూడా శ్రీలంక ఆటగాళ్లకు సాయం చేశారు. బౌండరీ ఆపే క్రమంలో బండార మొకాలు వాండార్సే పొత్తికడుపులో బలంగా తాకడంతో అతను తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. బండారా లేచిన నొప్పితో ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఇక వాలంటీర్స్ స్ట్రెచర్ సాయంతో వాండార్సేను మైదానం బయటకు తీసుకెళ్లి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version