T20 World Cup 2024: నేడు బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌..

-

T20 World Cup 2024: మరో ఫైట్‌ కు సిద్ధం అయింది టీమిండియా జట్టు. టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ నేడు రెండో సూపర్ హిట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది. లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు…. సూపర్-8 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసిన భారత్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.

India vs Bangladesh, 47th Match, Super 8 Group 1

ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియాకు సెమీ ఫైనల్ బెర్త్ దక్కినట్లే. బలబలాలు ఈ టోర్నీలో ప్రదర్శన చూసిన టీమిండియాదే పైచేయి. సూపర్-8 మ్యాచులో భారత్ ఆఫ్గానిస్థాన్ ను చిత్తు చేసింది. అటు బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. అయితే పరిస్థితులు, బలబలాలు ఎలా ఉన్నా… ప్రపంచ క్రికెట్ లో బంగ్లాదేశ్ జట్టు ఎన్నోసార్లు పెద్ద జట్లను ఓడించింది. టీమిండియాకు కూడా గతంలో షాక్ ఇచ్చింది. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news