ఆ రైతులకే మాత్రమే రుణాలు మాఫీ చేస్తాం – సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రైతులకు షాక్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. 12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ హామీపై శుక్రవారం రాత్రి కాబినెట్ సమావేశం జరిపారు.

cm revanth reddy orders telangana dgp

ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…రూ.2 లక్షల వరకు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

‘డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం దాదాపు రూ.31 వేల కోట్లు అవసరం. వీటిని సేకరించి అన్నదాతలకు రుణవిముక్తి కల్పిస్తాం. వ్యవసాయం దండగ కాదు పండగ అని భరోసా కల్పిస్తాం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కాగా, ఆగస్ట్ 15వ తేదీ లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news