పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య… మరో కీలక పోరు జరగనుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి.
నిన్న ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడట విరాట్ కోహ్లీ. ఒకవేళ విరాట్ కోహ్లీ ఆడకపోతే అతని స్థానంలో పంత్ ఆడే ఛాన్స్ ఉంది. ఇవాళ జరిగే పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జియో హాట్ స్టార్ , స్టార్ స్పోర్ట్స్, న్యూస్ 18 చానల్స్ లో చూడవచ్చు. అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… గత రికార్డ్స్ టీమ్ ఇండియాను వనికిస్తున్నాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడింది. అయితే దానిపై ఇప్పుడు ప్రతీకారం తీర్చు కునేందుకు రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు.