రవిచంద్రన్ అశ్విన్‌ సంచలనం.. రిటైర్మెంట్‌ ప్రకటన !

-

టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్‌ వీడ్కోలు పలికాడు. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన చేశాడు రవిచంద్రన్ అశ్విన్‌.

India’s spin spearhead Ashwin retires from international cricket

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు రవిచంద్రన్ అశ్విన్‌. టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ డ్రాగ ముగిసింది. వర్షం అలాగే బ్యాడ్ లైట్ కారణంగా… ఐదవ రోజు ఆట కొనసాగలేదు. దీంతో మూడో టెస్టును… డ్రాగ ప్రకటించారు అంపైర్లు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో… ఐదు టెస్టుల సిరీస్ 1-1 తేడాతో సమం అయింది. అయితే.. మ్యాచ్‌ డ్రా అయిన తర్వాతనే అశ్విన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించారు. వన్డేలు, టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్‌ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news