టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ డ్రాగ ముగిసింది. వర్షం అలాగే బ్యాడ్ లైట్ కారణంగా… ఐదవ రోజు ఆట కొనసాగలేదు. దీంతో మూడో టెస్టును… డ్రాగ ప్రకటించారు అంపైర్లు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో… ఐదు టెస్టుల సిరీస్ 1-1 తేడాతో సమం అయింది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు నష్టపోయి 89 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది ఆస్ట్రేలియా జట్టు. ఇక టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 260 పరుగులు చేస్తే…రెండవ ఇన్నింగ్స్ లో 8 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగించలేమని ప్రకటించారు అంపైర్లు. ఇక టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మరో రెండు టెస్టులు జరుగాల్సి ఉంది.