ఐపీఎల్:ప్లే ఆఫ్ లో నేడు ఆసక్తికరపోరు..ఓడితే ఇంటికే…!

-

ఐపీఎల్ 2020సీజన్‌లో మరో ఆసక్తికర పోరు. భిన్నమైన ఆటతీరుతో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు ఎలిమినేటర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా ఐదోసారి ప్లే ఆఫ్స్ చేరుకున్న హైదరాబాద్ సెకండ్ టైటిల్‌పై గురిపెట్టగా.. మూడేళ్ల తర్వాత నాకౌట్‌కు వచ్చిన బెంగళూరు ఈ సారైనా విజేతగా నిలవాలని చూస్తోంది.

టోర్నీ ఆరంభంలో తడబడినా…ఇప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌ సమతూకంగా ఉంది. అనూహ్యంగా ఓపెనింగ్‌ అవకాశం దక్కించుకున్న వృద్దిమాన్ సాహా చెలరేగుతుండటంతో మరో ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌పై భారం తగ్గింది. వీరిద్దరు మరోసారి శుభారంభం అందిస్తే ఆరెంజ్ ఆర్మీ భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. వీరితో పాటు మిడిలార్డర్‌లో మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ల్ సమద్‌ బాధ్యతగా ఆడాల్సి ఉంది. ఫైనల్‌ జట్టులో అభిషేక్ శర్మ, ప్రియామ్ గార్గ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఆల్‌రౌండర్‌ జాసన్ హోల్డర్‌ రాకతో హైదరాబాద్‌ స్ట్రాంగ్‌గా మారింది.

అదృష్టవశాత్తూ నెట్‌రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్‌కు చేరినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నాలుగు వరుస ఓటములతో ఆ జట్టు పూర్తిగా డీలాపడిపోయింది. ఏబీ డివిలియర్స్‌పై అతిగా ఆధారపడుతుండటం, కోహ్లీ తన స్థాయికి తగినట్లుగా ఆడకపోవడం కూడా జట్టును దెబ్బ తీస్తోంది. ఇప్పటి వరకు పడిక్కల్‌ ఒక్కడే నిలకడైన ప్రదర్శన చేశాడు. మంచి బౌలింగ్ లైనప్ ఉన్న సన్‌రైజర్స్‌పై ఓపెనర్లు మంచి ఆరంభం అందిస్తేనే ఆర్‌సీబీ భారీ స్కోరు చేయగలదు. అయితే ఏబీ, విరాట్‌లను ఔట్‌ చేస్తే పతనం మొదలైపోతుందని లీగ్‌లో ఇప్పటికే రుజువైంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు సుందర్, చాహల్‌ కీలకం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version