ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ లు అహమదాబాద్ వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆప్స్ కు చేరే మొదటి జట్టుగా అవతరించాలని గుజరాత్ టైటాన్స్ ప్రయత్నిస్తుంటే… SRH ఇందులో గెలిచి ఆఖరి మ్యాచ్ వరకు ప్లే ఆఫ్ కోసం పోరాడాలన్న కసితో ఉంది. కాగా మొదట టాస్ గెలిచినా గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. సాహా మొదటి ఓవర్ లోనే డక్ అవుట్ గా వెనుతిరగగా, ఆ తర్వాత గిల్ మరియు సుదర్శన్ లు మరో వికెట్ పడకుండా గుజరాత్ కు భారీ స్కోర్ ను అందించడానికి పోరాడుతున్నారు. ముఖ్యంగా గిల్ అయితే మాస్టర్ స్ట్రోక్స్ తో గ్రౌండ్ కు నాలుగు వైఫీలా బంతిని బాదుతూ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు.
ఐపీఎల్ 2023 : భారీ స్కోర్ దిశగా గుజరాత్ టైటాన్స్… SRH కు ఓటమి తప్పేలా లేదుగా !
-