ఈ ఐపీఎల్ లో సీజన్ మొత్తం పూర్తి అయిన తర్వాత కొన్ని పురస్కారాలను ప్లేయర్స్ అందచేస్తారు. అందులో అధిక పరుగులు, అధిక వికెట్లు, అధిక సిక్సులు, అధిక ఫోర్లు మరియు క్యాచ్ లు ఇలా చాలా విభాగాలు ఉంటాయి. కాగా ప్రస్తుతం సీజన్ లో అధిక ఫోర్లు జాబితాలో మొదటి స్థానానికి ఇద్దరు ప్లేయర్స్ మధ్యన భారీగా పోటీ ఉండనుంది. అయితే ఇద్దరూ కూడా ఇండియాకు చెందిన ప్లేయర్స్ కావడం విశేషం. వారిలో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన యశస్వి జైస్వాల్ ఒకరైతే.. గుజరాత్ టైటాన్స్ కు చెందిన శుబ్ మాన్ గిల్ మరొకరు. వీరిద్దరూ వారి జట్లకు ఓపెనర్లుగా వచ్చి జట్టుకు విజయాలను అందిస్తున్నారు. ఇక వీరిద్దరూ అధిక ఫోర్లు విభాగంలో పోటీ పడుతున్నారు.