ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ జేక్ ఫ్రెజర్-మెక్ గుర్క్ (55) తన తొలి మ్యాచ్ లోనే 50తో చెలరేగారు. పాండ్యా బౌలింగ్ లో హ్యాట్రిక్ సహా 5 సిక్సర్లు బాదారు. 22 ఏళ్ల మెక్ గుర్క్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించారు. 2019లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2020లో బిగ్ బాష్ లో అరంగేట్రం చేసి ఇప్పటివరకు 645 రన్స్ బాదారు. దేశవాళీ క్రికెట్ లో 29 బంతుల్లోనే సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించారు.
కాగా, ఈ మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. ఐపిఎల్ టోర్నమెంట్ లో అతి తక్కువ బంతుల్లో మూడు వేల పరుగులు చేసిన బ్యాటర్ గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 2028 పరుగులు చేశాడు రిషబ్ పంత్.రిషబ్ పంత్ తర్వాత స్థానాలలో యూసఫ్ పఠాన్ 2062 పరుగులు చేసి రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ మరియు సురేష్ రైనా ఉన్నారు.