ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు మాజీ కెప్టెన్ పాల్గొంటాడని తెలుస్తోంది. ఇప్పటికే రోహిత్ ఏ జట్టుకు వెళతాడని జోరుగా ప్రచారం సాగుతోంది. రోహిత్ లక్నో లేదా బెంగళూరుకు వెళ్లాలని అతడి అభిమానులు కోరుతున్నారు. రోహిత్ రాక కోసం చాలా ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. అయితే, రిటెన్షన్ విధానంలో ముంబై జట్టు రోహిత్‌ను వదులుకుంటుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గత సీజన్‌లో రోహిత్ శర్మను ముంబై జట్టుకు కెప్టెన్‌గా తొలగించి ఆ స్థానాన్ని హార్దిక్ పాండ్యాకు యాజమాన్యం అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సీజన్‌లో ముంబై జట్టు దారుణం విఫలమైంది. లీగు మ్యాచుల్లోనే ఘోరమైన ఓటములను చవిచూసింది. ఇక కెప్టెన్సీ నుంచి తప్పించడంతో రోహిత్ ఫ్రాంచైజీ మారుతాడని చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై మాజీ ఇండియన్ క్రికెటర్ స్పందిస్తూ.. ‘వచ్చే మెగావేలంలో రోహిత్ తప్పుకుండా ముంబైని వీడుతాడని తెలిపారు. ఆయన అదే అభిప్రాయంతో ఉన్నాడని చెప్పారు. అయితే, వేలానికి రాకుండా నేరుగా మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ అయ్యే చాన్సుందని వెల్లడించారు. ముంబైతో రోహిత్ ప్రయాణం ముగిసిందనుకుంటున్నా’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయంవ్యక్తంచేశారు.