ఐపీఎల్ 2025 టోర్నమెంట్ పై కీలక అప్డేట్ వచ్చేసింది. ఐపీఎల్ 2025 రిటెన్షన్ నిబంధనలు ఖరారు అయ్యాయి. ఫ్రాంచైజీ పర్స్ వ్యాల్యూ రూ.120 కోట్లకు పెంచేశారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఎం.ఎస్.ధోనీ..ఈ సారి బరిలో ఉండనున్నాడు. ఐపీఎల్ 2025 రిటెన్షన్ నిబంధనలు ఒకసారి పరిశీలిస్తే… ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు 2027 ఐపీఎల్ వరకు కొనసాగాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఆరుగురిని రిటైన్ చేసుకునే అకాశం ఉందని సమాచారం. రిటైన్ చేసుకునే ఆరుగురు ఆటగాళ్లలో ఒకరు కచ్చితంగా అన్ క్యాప్డ్ ప్లేయర్ ఉండాలని పేర్కొంది. గరిష్టంగా ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఉంది. రిటైన్ లిస్ట్ లో విదేశీ ప్లేయర్లకు ఎలాంటి పరిమితి లేదని సమాచారం. మెగా వేలంలో పాల్గొనే విదేశీ ఆటగాళ్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది. రిజిస్టర్ చేసు కోకపోతే మినీ వేలం లో పాల్గొనే అవకాశం లేదని వెల్లడించింది.