ఐపీఎల్: దినేష్ కార్తీక్ మెరుపులు.. పంజాబ్ లక్ష్యం 165.

-

కింగ్స్ ఎల్వన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో మొదటి బ్యాటింగ్ కి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 164పరుగులు చేయగలిగింది. ఓపెనర్లుగా దిగిన త్రిపాఠి నాలుగు పరుగులు చేసి ఔటవ్వగా, ఆ తర్వాత వచ్చిన నితేష్ రానా 2 పరుగులు మాత్రమే చేసాడు. ఇయాన్ మోర్గాన్ కొంచెం డీసెంట్ గానే ఆడాడు. 23బంతుల్లో 24పరుగులు( 2ఫోర్లు, 1సిక్సర్) చేసాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు.

శుభ్ మంగిల్ కి మంచి జోడీగా పంజాబ్ బౌలర్లపై పిడుగులా పడ్డాడు. 29బంతుల్లో 58పరుగులు చేసిన దినేష్ కార్తీక్, 8ఫోర్లు, 2సిక్సర్లు బాదాడు. ఐతే అనుకోకుండా రనౌట్ అయ్యాడు. అటు శుభ్ మంగిల్ కోల్ కతా స్కోరుని నిలబెడుతూ,57పరుగులు(47బంతుల్లో 5ఫోర్లు) చేసాడు. ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి కోల్ కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్లు కోల్పోయి 164పరుగులు చేయగలిగింది.

పంజాబ్ బౌలర్లలో షమీ, అర్షీద్ సింగ్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఆరు వికెట్లలో మూడు రనౌట్లు కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version