బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌కి పాలించడం చేత కావడం లేదని బాంబు పేల్చారు. మీకు చేతకాకపోతే మమ్మల్ని డైరెక్షన్ అడగండి అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. లేదంటే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రి తెచ్చుకోండని పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడుపుతున్నాడా? లేక మంత్రులు, ఎమ్మెల్యేలు నడుపుతున్నారా? అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఇక ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ కు సలహా ఇచ్చే అంత కెపాసిటీ కొత్త ప్రభాకర్ రెడ్డికి లేదన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ నిలబడమంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు.. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచినా కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ దగ్గర అటెండర్ లాగే ఉండాల్సిందే అని చురకలు అంటించారు.
కాంగ్రెస్‌కి పాలించడం చేత కావడం లేదు
మీకు చేతకాకపోతే మమ్మల్ని డైరెక్షన్ అడగండి
లేదంటే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రి తెచ్చుకోండి
ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడుపుతున్నాడా?
లేక మంత్రులు, ఎమ్మెల్యేలు నడుపుతున్నారా? అర్థం కాని పరిస్థితి ఉంది
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త… pic.twitter.com/PyCRM32n6e
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 2, 2025