అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కోపా అమెరికా 2024 ఫైనల్ మ్యాచ్‌లో వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ మ్యాచ్ లో అర్జెంటీనా విజయం సాధించి 16వసారి టైటిల్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మరి మెస్సీ ఎందుకు ఏడ్చినట్టు అనుకుంటున్నారా.. ?కచ్చితంగా అవి విజయానందంలో వచ్చిన ఆనంద భాష్పాలు మాత్రం కాదు. మరి ఏమైందంటే..?
ఈ మ్యాచ్ లో మెస్సీ ఆఖరి వరకూ గ్రౌండ్లో లేడు. గేమ్ ఫస్ట్ హాఫ్‌లో మెస్సీ కుడికాలి చీలమండకి గాయం కావడంతో నొప్పితో విలవిలలాడిన మెస్సీకి వెంటనే ఫిజియోలు చికిత్స అందించారు. ఆ తర్వాత ఆటలోకి దిగిన మెస్సీ చీలమండ వాపుతో ఉబ్బడంతో తీవ్ర నొప్పికి గురయ్యాడు. ఇక ఫిజియోల సూచన మేరకు మెస్సీ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ మెస్సీ కెరీర్లో ఇదే ఆఖరి మ్యాచ్. దీంతో ఆట ముగిసేదాకా గ్రౌండ్లో ఉండాలనే ఉద్దేశంతో మెస్సీ బరిలోకి దిగినా.. మధ్యలో గాయం కారణంగా డగౌట్లో కూర్చోవాల్సి రావడంతో మెస్సీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. డగౌట్లో కూర్చోని వెక్కి వెక్కి ఏడ్చాడు. మెస్సీని అలా చూడలేకపోయిన అభిమానులు.. వాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు
Lionel Messi fans made fun of Cristiano Ronaldo crying at the EUROS only for Messi to end like this.
Life comes at you fast.pic.twitter.com/QRAUlyinsb
— The CR7 Timeline. (@TimelineCR7) July 15, 2024