రివైండ్ 2024 : నిన్న గుకేష్, మొన్న ప్రజ్ఞానంద.. చెస్ లో ఈ సంవత్సరం భారతీయులు సాధించిన విజయాలు

-

ఈ సంవత్సరం భారతీయ చెస్ చాంపియన్లకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. తాజాగా 18 సంవత్సరాల గుకేష్ దొమ్మరాజు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. చైనాకు చెందిన డింగ్ లిరెన్ ని ఓడించి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ని గుకేష్ దొమ్మరాజు కైవసం చేసుకున్నాడు.

గుకేష్ దొమ్మరాజు మీద ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రీసెంట్ గా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

ఇదే సంవత్సరం నార్వే చెస్ 2024 టోర్నమెంట్ లో 18 సంవత్సరాల ఆర్ ప్రజ్ఞానంద.. వరల్డ్ నంబర్ వన్ అయిన మ్యాగ్నస్ కార్ల్ సెన్ ని ఓడించాడు. అంతేకాదు టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్ లో ప్రజ్ఞానంద రన్నరప్ గా నిలిచాడు.

ఇకపోతే చెస్ చరిత్రలోనే తొలిసారిగా ఇండియాకు బంగారు పతకం లభించింది. హంగేరి లో జరిగిన చెస్ ఒలంపియాడ్ లో.. ఓపెన్ విభాగంలో.. ఆర్ ప్రజ్ఞానంద, గుకేష్ దొమ్మరాజు, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి స్వర్ణ పతకాన్ని సాధించారు. మరోవైపు ద్రోణవల్లి హారిక, వైశాలి,
దివ్యదేశముఖ్, వంతిక అగర్వాల్, తానియా సచ్ దేవ్ లకు మహిళా విభాగంలో బంగారు పతకం దక్కింది.

మొత్తానికి ఈ ఏడాది చెస్ పోటీల్లో ఇండియాకు చెప్పుకోదగిన విజయాలు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version