IPL 2024 : రెండు గ్రూపులుగా MI జట్టు చీలిపోయిందా..అంటే అవుననే అంటున్నారు. నాయకత్వం మార్పుతో MI జట్టు రెండు గ్రూపులుగా చీలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్, సూర్య, బుమ్రా ఒక టీమ్ గా ఉండగా….హార్దిక్, ఇషాన్ తదితర ఆటగాళ్లు మరో గ్రూప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి వచ్చిన ఇషాన్ రంజీ మ్యాచులు ఆడకుండా హార్దిక్ తో కలిసి ప్రాక్టీస్ చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది.
ఈ పరిమాణాలతో వచ్చే ఐపీఎల్ లో MI ప్రదర్శన ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సిందే. కాగా, గుజరాత్ టైటాన్స్ నుంచి ఆల్ రౌండర్ పాండ్యను ట్రేడింగ్‌లో తీసుకుని ముంబై ఇండియన్స్ అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తొలగించింది. హిట్ మ్యాన్ స్థానంలో హార్దిక్ పాండ్యకు కెప్టెన్ పగ్గాలు అప్పగించింది. అయితే.. వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన హార్దిక్ ఇంకా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి.