Mumbai Indiansను వెంటాడుతున్న చెత్త రికార్డు.. గత 12 సీజన్లలో శుభారంభం లేదు!

-

MI’s wait for IPL opener win extends to 12 years:ఐపీఎల్ 2024 టోర్నమెంటులో ముంబై ఇండియన్స్ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. గెలుపు వరకు వచ్చి చేజేతుల మ్యాచ్ పోగొట్టుకుంది ముంబై ఇండియన్స్. నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు కంటిన్యూ అవుతోంది.

MI’s wait for IPL opener win extends to 12 years

2013 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆ జట్టు ప్రతిసారి తొలి మ్యాచ్లో ఓడిపోతూ వస్తోంది. వరుసగా 12 సీజన్లలో ఒక్కసారి కూడా గెలవలేదు ముంబై ఇండియన్స్. కెప్టెన్ ను మార్చిన ఫలితం లేకుండా పోయింది.ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ అది నుంచి ఇబ్బంది పడ్డది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 162 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 6 పరుగులు తీయడంతో మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version