ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో దూకుడుగా వ్యవహరిస్తున్న భారత బౌలర్ సిరాజ్ కు ఐసిసి బిగ్ షాక్ ఇచ్చింది. డకెట్ వికెట్ తీసిన సందర్భంగా అరుస్తూ మైదానంలోనే సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో సిరాజ్ ప్రవర్తన అస్సలు బాగోలేదని అతడు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ మ్యాచ్ ఫీజులో 15% కోతతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా విధించింది.

దీంతో సిరాస్ డీమెరిట్ పాయింట్ల సంఖ్య రెండుకు చేరుకుంది. కాగా, 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు కనక వచ్చినట్లయితే ఆటగాడిపై నిషేధం విధిస్తారు. దీంతో సిరాజ్ అభిమానులు కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరాజ్ తన ప్రవర్తనను కొద్దిగా మార్చుకుంటే బాగుంటుందని వేడుకుంటున్నారు. దీనిపైన సిరాజ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.