సిల్వర్ మెడల్‌ వచ్చినందుకు ఆనందమే.. కానీ: నీరజ్ చోప్రా

-

పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో నీరజ్‌ చోప్రా సిల్వర్‌ మెడల్‌ను సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో పాకిస్థాన్‌ జావెలిన్‌ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్‌ స్వర్ణం సాధించాడు. అర్షద్ 92 మీటర్ల మార్క్‌ను తాకగా.. నీరజ్‌ 89.45 మీటర్లు విసిరి రజతం తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో నీరజ్‌ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే నీరజ్ చోప్రా తన విజయంపై స్పందిస్తూ ఓ విషయంలో బాధగా అనిపిస్తోందని చెప్పారు.

భారత్కు పతకం వచ్చినందుకు సంతోషంగా ఉందని.. కానీ తన ప్రదర్శనను ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉందని నీరజ్ అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు చాలా అద్భుత ప్రదర్శన చేశారని.. జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో చాలా పోటీ ఉందని చెప్పారు. ప్రతి అథ్లెట్‌ తనదైన రోజున సత్తా చాటుతాడన్న నీరజ్.. పాకిస్థాన్ అథ్లెట్ను ఉద్దేశించి అది అర్షద్‌ డే అని చెప్పుకొచ్చారు. తాను వందశాతం కష్టపడ్డానని.. కానీ, మరికొన్ని అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పారిస్లో మన జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు బాధగా ఉందని నీరజ్ చోప్రా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news