టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఐసిస్ ర్యాంకింగ్ లో సిరాజ్ 709 రేటింగ్ పాయింట్స్ టాప్ ప్లేస్ లోకి దూసుకొచ్చాడు. భారత్ జరిగే వరల్డ్ కప్ 2023 ఆడిన మ్యాచ్ ల్లో 10 వికెట్లు తీయడం ఈ హైదరాబాద్ ర్యాంకు మెరుగు పడటానికి దోహదం చేసింది. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో సిరాజ్ చెలరేగాడు. ఆ తరువాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కూడా కీలక వికెట్ తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
వన్డేలో నెంబర్ వన్ బౌలర్ గా నిలవడం పై టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ర్యాంకులను తాను పట్టించుకోనని.. ప్రపంచ కప్ ను భారత్ గెలవడమే నా ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. టీమిండియాలో భాగం అయినందుకు నేను గర్విస్తున్నాను. మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన ఇస్తున్నందుకు సంతోష పడుతున్నాను. వచ్చే ప్రతీ మ్యాచ్ లో భారత్ రాణిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు బౌలర్ సిరాజ్.