ఆసియా గేమ్స్​లో భారత్​కు 100 పతకాలు.. దేశం గర్వపడేలా చేశారంటూ ప్రధాని ట్వీట్

-

ఆసియా గేమ్స్​లో భారత్ హిస్టరీ క్రియేట్ చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆటల్లో సత్తా చాటుతోంది. ఎన్నో ఏళ్లుగా ఆసియా గేమ్స్​లో 100 పతకాల కల గంటున్న భారత్​ కు నేడు ఆ కల నెరవేరింది. ఆసియా క్రీడల్లో హిందుస్థాన్ 100 పతకాలు గెలుచుకుంది. ఒక్క ఈరోజే మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది. దీంతో ఈ క్రీడల్లో ఇండియా గెలుచుకున్న బంగారు పతకాల సంఖ్య 25కు చేరింది. 35 రజత పతకాలు.. 40 కాంస్య పతకాలను భారత్ అథ్లెట్లు సాధించారు. ఈ పోటీలు ముగియడానికి మరో రోజు ఉండటంతో భారత్ ఇంకా పతకాలు సాధించే అవకాశం ఉంది.

ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇంతటి ఘనత అందుకున్న భారత అథ్లెట్లకు మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పుడెప్పుడు వారిని కలిసి అభినందించాలని ఉత్సాహంగా ఉందని ట్వీట్ చేశారు. దేశానికి చారిత్రక విజయాలను అందించిన అథ్లెట్లకు కృతజ్ఞతలు చెప్పారు. ఈనెల 10వ తేదీన ఆసియా క్రీడల్లో రాణించిన క్రీడాకారుల బృందానికి ఆతిథ్యమిచ్చి వారితో ముచ్చటించడానికి ఎదురుచూస్తున్నానని మోదీ ట్విటర్​లో రాసుకొచ్చారు

Read more RELATED
Recommended to you

Exit mobile version