భారత స్టార్ షట్లర్ పివి సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. 2025 ఆసియా ఛాంపియన్షిప్ నుంచి ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఛాంపియన్ షిప్ లో తొలి మ్యాచ్‌లో నెగ్గిన సింధు రెండో రౌండ్లో ఓటమి పాలైంది. జపాన్‌కు చెందిన యమగుచి చేతిలో 12-21, 21-16, 16-21 తేడాతో సింధు పరాజయం చూసింది. ఓటమితో సింధు ఆసియా ఛాంపియన్షిప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
జపాన్‌కు చెందిన యమగుచితో సింధు గురువారం రోజున రెండో రౌండ్లో హోరాహోరీగా తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలి నుంచి యమగుచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. మొదటి సెట్లో భారీ తేడా 12-21తో యమగుచి సింధుపై నెగ్గింది. ఇక రెండో సెట్ లో సింధు కమ్‌బ్యాక్ ఇస్తూ.. ప్రత్యర్థికి సవాల్ విసింది. అలా రెండో రౌండులో ఇద్దరి మధ్య కాసేపు హోరాహోరీగా పోరు సాగింది. ఫలితంగా రెండో సెట్‌ను సింధు 21-16తో దక్కించుకుంది. దీంతో ఫలితం కోసం మూడో సెట్ ఆడాల్సి రావడంతో చివర్లో యమగుచి 16-24 తేడాతో నెగ్గి మ్యాచ్ సొంతం చేసుకుంది.