Rajasthan Royals End Royal Challengers Bengaluru’s Dream:క్రికెట్ అభిమానులను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిరాశ పరిచింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో దారుణంగా ఓడిపోయింది బెంగళూరు జట్టు. దీంతో ఇంటికి పయనమైంది RCB. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టేజ్లో వరుసగా 6 మ్యాచు గెలిచి ప్లే ఆఫ్ రేసులోకి వచ్చిన ఆర్సిబి… అసలు సిసలైన మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది.

ఎలిమినేటర్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి జట్టు ఎనిమిది వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ పడుతూ లేస్తూ ఆ లక్ష్యాన్ని 19 వ ఓవర్ లో చేదించగలిగింది. దీంతో 24వ తేదీన హైదరాబాద్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఫైనల్ మ్యాచ్ 26వ తేదీన కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు తో ఉండనుంది.