నేడు ఐపీఎల్ డబుల్ ధమాకా ఉండనుంది. క్రికెట్ అభిమానులకు డబుల్ ఎంటర్ టైన్మెంట్ లభించనుంది. IPL 2025లో భాగంగా ఆదివారం రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

అటు, ఢిల్లీ వేదికగా సాయంత్రం 7:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన ముంబై విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
కాగా IPLలో PBKSపై శతకం నమోదు చేసిన వెంటనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన జేబులో నుంచి ఒక చిన్న కాగితాన్ని తీసి చూపిస్తూ తన ప్రత్యేక ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందులో ‘This One is For Orange Army’ అని రాసి ఉండటం విశేషం. వరుసగా 5 మ్యాచ్‌లలో పెద్దగా రాణించని అభిషేక్‌కి SRH మేనేజ్‌మెంట్ మళ్లీ అవకాశమిచ్చింది. ఆ నమ్మకాన్ని ఉపయోగించుకున్న ఆయన ఈ మ్యాచ్‌లో వీర విజృంభణ చేశారు.