ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. తొలి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే ఇళ్లను కేటాయించాలని రేవంత్ ఆదేశించారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలన్నారు.

లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. ఇళ్లకు సిమెంట్, స్టీల్ సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.