RCB క్రికెటర్ యశ్ దయాల్‌పై రేప్ కేసు !

-

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు యశ్ దయాల్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్ పై యువతి కేసు పెట్టింది. ఘజియాబాద్ నగరానికి చెందిన ఓ యువతి… బెంగళూరు బౌలర్ యశ్ దయాల్ పైన అత్యాచార ఆరోపణలు చేసి… కేసు పెట్టింది. వెంటనే తనకు న్యాయం చేయాలని యూపీ సీఎం ఆన్లైన్ గ్రీవెన్స్ సెల్ లో ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది.

RCB Pacer Yash Dayal Accused Of Sexual Exploitation, Assault On Pretext Of Marriage
RCB Pacer Yash Dayal Accused Of Sexual Exploitation, Assault On Pretext Of Marriage

యశ్ దయాల్ అలాగే నేను ఇద్దరం ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని ఈ సందర్భంగా పేర్కొంది. అయితే పెళ్లి చేసు కుంటానని తనతో శారీరకంగా దగ్గరయ్యాడని… ఈ సందర్భంగా పేర్కొంది యువతి. అలాగే తన దగ్గర డబ్బులు తీసుకొని ఇతర అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడు నాతో ఏ సంబంధం లేదని అంటున్నాడని వెల్లడించింది. దీంతో ఆ బాధ్యత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజమని తేలితే ఆర్సిబి బౌలర్ యశ్ దయాల్ కెరీర్ ముగిసినట్లేనని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news