కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన భారత జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలను ఫాన్స్ తో పంచుకుంటున్నారు. జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను బౌన్స్ బ్యాక్ క్యాప్షన్ తో ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
దీంతో జట్టులోకి మీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2024 టీ20 WCలోకి పంత్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా… IPL 2024 ఆడేందుకు పంత్ వచ్చేస్తున్నాడు అని పేర్కొన్నారు ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ గంగూలీ. IPL-2024లో రిషబ్ పంత్ పాల్గొనడంపై ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కీలక వాక్యాలు చేశారు. ‘పంత్ గాయాల నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. వచ్చే ఐపిఎల్ లో కచ్చితంగా ఆడతాడు. డిసెంబర్ 19న దుబాయ్ లో జరగనున్న ఐపీఎల్ వేలానికి ముందు జట్టు నిర్మాణంపై ఫోకస్ చేస్తాం’ అని గంగూలి తెలిపారు.