KCR ఆదేశంతో రాజీనామాపై వెనక్కి తగ్గారు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పదవికి తాను చేసిన రాజీనామాను పుట్ట మధు వెనక్కి తీసుకున్నారు. మంథనిలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మధు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు.
అనంతరం కెసిఆర్ ను కలిసి రాజీనామా అంశాన్ని ప్రస్తావించగా…. వెంటనే రాజీనామా వెనక్కి తీసుకోవాలని, ఇది ఒక్క నియోజకవర్గంలో జరిగిన అంశం కాదని మాజీ సీఎం తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు అయ్యేలా ప్రజల తరఫున పోరాడాలని మధుకు సూచించారు.
కాగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జడ్పీ ఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డికి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పార్ధివదేహానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.