మోదీ నుంచి ఆ ఒక్క ఫోన్‌ కాల్‌తో రిలాక్స్ అయిపోయా : రిషభ్‌ పంత్

-

టీ20 ప్రపంచ కప్‌ దక్కించుకున్న తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఫోన్‌ కాల్‌ గురించి ప్రధానితో స్టార్ ప్లేయర్ రిషభ్‌ పంత్ షేర్ చేసుకున్నాడు. ఆ కాల్‌ చేసింది మోదీనే కావడం గమనార్హం. ఇంతకీ మోదీ ఫోన్కాల్ దేని గురించి అంటే?

‘‘వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత మమ్మల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ వరల్డ్‌ కప్ ముందు నేను ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యా. ఆ సమయంలో మా అమ్మకు పీఎం ఫోన్‌ చేశారు. అప్పుడు నా కెరీర్‌ గురించి చాలా విషయాలు మదిలో తిరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే మోదీ ఫోన్ చేశారని మా అమ్మ చెప్పారో.. ఇక నాకు ఎలాంటి సమస్య లేదనిపించింది. మానసికంగానూ రిలాక్స్‌ అయిపోయా.

గాయాల నుంచి కోలుకుంటున్న సమయంలో నేను మళ్లీ క్రికెట్‌ ఆడతానా? లేదా? అనేది పక్కన పెట్టేశా. వికెట్ కీపింగ్‌ చేయగలడా? లేదా అని బయట నుంచి కొన్ని మాటలు వినిపించాయి. దీంతో మరింత కష్టపడితే మైదానంలోకి అడుగు పెట్టడం కష్టమేం కాదని గ్రహించా. నేను తిరిగి ఆడగలనని నిరూపించుకోవడానికి ఈ క్లిష్ట పరిస్థితిని ఉపయోగించుకున్నా. భారత జట్టు విజయంలో నా వంతు భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది’’ అని పంత్‌ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news