BAN తో డిసెంబర్ 22 నుంచి జనవరి 2వ టెస్ట్ కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. గాయం కారణంగా తొలి టెస్ట్ కు దూరమైన హిట్ మ్యాన్, ఇంకా కోలుకొకపోవడంతో రెండో టెస్టులో కూడా ఆడకపోవచ్చు అని సమాచారం. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనుండగా, దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న రోహిత్ కు ఇంకాస్త విశ్రాంతి ఇవ్వాలని బీసీసీ భావిస్తోంది.
కాగా, సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఏకంగా 188 పరుగుల తేడాతో టీమిండియా విజయ డంకాను మోగించింది. రెండో ఇన్నింగ్స్ లో 513 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ను ఆరంభించిన బంగ్లాదేశ్ జట్టు 324 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే ఐదో రోజు మొదటి సెషన్ లోనే టీమిండియా విజయం సాధించింది.