ఐసీసీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సచిన్ టెండుల్కర్.. వీడియో

-

హసన్ అలీ బౌలింగ్ లో రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ ను 2003 వరల్డ్ కప్ లో అదే భారత్, పాక్ మ్యాచ్ లో షోయెబ్ అక్తర్ వేసిన బౌలింగ్ లో సచిన్ కొట్టిన సిక్స్ తో పోల్చుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగి రెండు రోజులు అయినా.. ఇంకా క్రికెట్ అభిమానులు ఆ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే.. భారత్, పాక్ మ్యాచ్ లో హైలెట్స్ అంటే రోహిత్ శర్మ శతకమే. సెంచరీ చేసి భారత్ కు భారీ విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ.

అయితే.. హసన్ అలీ బౌలింగ్ లో రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ ను 2003 వరల్డ్ కప్ లో అదే భారత్, పాక్ మ్యాచ్ లో షోయెబ్ అక్తర్ వేసిన బౌలింగ్ లో సచిన్ కొట్టిన సిక్స్ తో పోల్చుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే.. అదే వీడియోను ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఎవరు ఆ షాట్ ను బాగా ఆడారో చెప్పాలంటూ ట్వీట్ చేశారు. రోహిత్ శర్మ బాగా ఆడాడా లేక సచిన్ ఆడాడా.. అంటూ వాళ్లు వేసిన ప్రశ్నకు క్రికెట్ అభిమానులు బాగానే స్పందించారు కానీ… అదే వీడియోపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా స్పందించాడు. మేము ఇద్దరం ఒకే దేశం భారత్ కు చెందిన వాళ్లం.. మా ఇద్దరిదీ ముంబై కూడా. సో.. హెడ్స్ నేను గెలిచా.. టెయిల్స్ మీరు ఓడిపోయారు.. అంటూ కాస్త ఫన్నీగా ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version