బర్త్ డే స్పెషల్.. ధోనీ కాళ్లు మొక్కిన సాక్షి

-

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం (జులై 7వ తేదీ) 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ధోనీకి క్రీడా ప్రముఖులు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ధోనీ బర్త్ డే సెలబ్రేషన్ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ధోనీ సతీమణి సాక్షి సింగ్ భర్తతో కేక్ కట్ చేయించి అతడికి విషెస్ తెలిపింది. ధోనీకి కేక్ తినిపించిన సాక్షి ఆ తర్వాత తన కాళ్లకు నమస్కరించింది. ధోనీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఈ సెలబ్రేషన్లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్యూట్ పెయిర్ అంటూ ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు హ్యాపీ బర్త్ డే మాహి అంటూ విషెస్ చెబుతున్నారు.

మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘హ్యాపీ బర్త్డే కెప్టెన్ సాబ్’ అంటూ సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. ధోనీ సహచర ప్లేయర్, మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా ధోనీకి శుభాకాంక్షలు తెలిపాడు. ఐపీఎల్ టైమ్లో ధోనీ ఫ్యామిలీతో దిగిన ఫొటో ఒకటి షేక్ చేసి ‘హ్యాపీ బర్త్డే మహీ భాయ్. నీ హెలికాప్టర్ షాట్, స్టంపింగ్ స్కిల్స్లా రోజూ నువ్వు కూల్గా ఉండాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news