Sanjay Manjrekar Slammed For Racist Comment On-Air During Womens T20 World Cup 2024: కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ న్యూజిలాండ్ తో భారత్ మొదటి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన కొన్ని వాక్యాలు జాతి వివక్ష వివాదాన్ని చెలరేపాయి.

భారత జట్టు కోచింగ్ బృందంపై సహచర కామెంటేటర్ మాట్లాడుతూ…. మునిష్ బాలి గురించి ప్రస్తావించాడు. అయితే అతను ఎవరో తాను అసలు గుర్తుపట్టలేదని, ఉత్తర భారత ప్లేయర్ల గురించి తనకు పెద్దగా తెలియదంటూ మంజ్రేకర్ సంచలన వాక్యాలు చేశారు. దీంతో ఈ వివాదం చెలరేగుతోంది. కాగా.. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. ఇవాళ పాకిస్థాన్ తో టీమిండియా మ్యాచ్ ఉంది.