BREAKING : పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం.. మనూ బాకర్ సూపర్ రికార్డ్

-

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం దక్కింది. 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో కాంస్యం పతకం సొంతమైంది. మను బాకర్‌, సరబ్‌జోత్‌ జోడీ కాంస్య పతకం సాధించింది. కొరియా జంటపై 16-10 తేడాతో భారత జోడీ గెలుపొందింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను బాకర్‌ రికార్డు క్రియేట్ చేసింది.

వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించిన మను బాకర్ ఇవాళ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్య పోరులో సరబ్‌జ్యోత్‌తో కలిసి బరిలోకి దిగింది. సౌత్ కొరియా ద్వయం (లీ-యెజిన్‌)తో పోరులో ఈ ధ్వయం గెలుపు సాధించి భారత్ ఖాతాలో మరో పతకాన్ని జత చేసింది. మనుబాకర్‌ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా వాళ్లు 10 పాయింట్లు సాధించారు. అరుదైన రికార్డు క్రియేట్ చేసిన మనూ బాకర్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మరోవైపు పలువురు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version