పాక్‌ బౌలర్‌ పైకి దూసుకెళ్లిన వార్నర్‌.. వీడియో వైరల్‌

లాహోర్‌ వేదికగా జరుగుతున్న పాక్-ఆసీస్‌ మూడో టెస్టులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వార్నర్ వర్సెస్‌ బౌలర్‌ అఫ్రిది మధ్య జరిగిన ఘటన అందరినీ ఆశ్యర్యానికి గురి చేసంది. రెండో ఇన్నింగ్‌ లో వార్నర్‌, షాకిన్‌ ఆఫ్రిది నువ్వా నేనా అనే రీతిలో.. సై అంటే సై అంటూ దూసుకొచ్చేశారు. ఇద్దరూ ఒకరి ఛాతీ మరొకరు టచ్‌ చేసే విధంగా ఎదురెదురయ్యారు.

ఇదంతా చూస్తున్న తోటి ఆటగాళ్లు.. ఎంపైర్‌, ప్రేక్షకులు షాక్‌ కు గురయ్యారు. ఏంటి.. వీళ్లిద్దరూ గొడవ పడుతున్నారనుకున్నారు అందరూ. అసలు ఏం జరిగిందంటే.. అఫ్రిది వేసిన చివరి బంతిని వార్నర్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్న చేశాడు.

అటు నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌ లో ఖ్వాజా పరుగు తీసేందుకు ముందుకు రాగా.. నో రన్‌ అంటూ వార్నర్‌ చెప్పాడు. ఈలోగా అదే బంతిని అందుకునేందుకు వచ్చిన అఫ్రిది.. హఠత్తుగా వార్నర్‌పైకి దూసుకొచ్చేశాడు. చూస్తే.. వార్నర్‌ ను కొట్టేందుకే వెళుతున్నాడా అనిపిస్తుంది. ప్రస్తుతతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.