WORLD CUP 2023:బంగ్లాదేశ్ కు భారీ షాక్…!

-

వరల్డ్ కప్ లో పడుతూ లేస్తూ అష్టకష్టాలు పడుతున్న బంగ్లాదేశ్ కు బిగ్ షాక్ తగిలేలా ఉంది. మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్ జట్టు ఇండియా తో తలపడాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్ కు బంగ్లా కెప్టెన్ షకిబుల్ హాసన్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం షకిబుల్ హాసన్ గాయంతో బాధపడుతున్నట్లు టీం డైరెక్టర్ ఖలీద్ తెలియచేశాడు. ఈయన తెలుపుతున్న సమాచారం ప్రకారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో షకిబుల్ హాసన్ గాయపడగా, ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ కోలుకున్న ఇండియా తో మ్యాచ్ కు పూర్తి ఫిటినెస్ తో అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందేహమని ఖలీద్ క్లారిటీ ఇచ్చారు. అసలే అనుభవ లేమితో ఇబ్బంది పడుతున్న బంగ్లాదేశ్ కు ఆల్ రౌండర్ గా ఉన్న షకిబుల్ హాసన్ కనుక దూరమైతే జట్టుకు ఇబ్బందులు తప్పవు.

ఒకవేళ షకీబ్ దూరమైతే కెప్టెన్ గా లిటన్ దాస్ వ్యవహరించే అవకాశం ఉంది. కాగా ఇప్పటి వరకు బంగ్లా ఆడిన మూడు మ్యాచ్ లలో ఆఫ్గనిస్తాన్ మీద మాత్రమే గెలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news