ఆసియా కప్‌ దెబ్బ…ధావన్‌ కు కెప్టెన్సీ బాధ్యతలు

-

ఆసియాకప్‌ 2022 లో ఘోరంగా విఫలమై.. టీమిండియా ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టి20 ప్రపంచ కప్ 2022 కు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తో భారత్ సిరీస్ లు ఆడనుంది. ముందుగా దక్షిణ ఆఫ్రికాతో మూడు వన్డేలు, టీ 20ల సిరీస్ జరగనుంది. నివేదికల ప్రకారం టి20 ప్రపంచ కప్ దృష్ట్యా దక్షిణాఫ్రికా తో జరిగే వన్డే సిరీస్ కు భారత జట్టులోని కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారట.

రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కే.ఎల్.రాహుల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు వన్డే సిరీస్ ఆడరని అని సమాచారం. దాంతో సీనియర్ ఓపెనర్ షికర్ ధావన్ మరోసారి టీం ఇండియా కెప్టెన్ గా బాధ్యతలు అందుకోనున్నారు. ఇంతకుముందు కూడా ధావన్ చాలా సందర్భాలలో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 28 నుంచి దక్షిణ ఆఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్ సైడ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ, ‘టి20 ప్రపంచ కప్ కు ముందు భారత్ వన్డే సిరీస్ ను కలిగి ఉండటం సరికాదు. అయితే కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తో పాటు టి20 ప్రపంచ కప్ కు వెళ్లే ఆటగాళ్లందరికీ వండే సిరీస్ నుంచి విశ్రాంతినిస్తాం. దాంతో ఆస్ట్రేలియకు వెళ్లే ముందు వారికి స్వల్ప విరామం లభించనుంది. వన్డే జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version