Shoaib Malik : సానియా మీర్జాకు షాక్‌ ..పాక్‌ నటిని పెళ్లి చేసుకున్న మాలిక్‌ ?

-

Shoaib Malik : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఊహించని షాక్‌ తగిలింది. పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడిపోయారనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా మాలిక్‌ కీలక ప్రకటన చేశారని సమాచారం.

Shoaib Malik marries Pakistani actor Sana Javed

పాకిస్తాన్‌ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడట షోయబ్ మాలిక్. గతేడాది ఆగస్టు 20వ తేదీన షోయబ్ మరియు సనా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని సమాచారం అందుతోంది. అయితే.. శనివారం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారని నేషనల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా, తమ దేశాలకు వివిధ స్పోర్ట్స్ లలో ప్రాతినిధ్యం వహిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ అయిన షోయబ్ మాలిక్ మరియు ఇండియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాల జంట ఒక్కటి. పెళ్లి అయిన తర్వాత వీరిద్దరి అపురూపమైన ప్రేమకు గుర్తుగా ఒక బాబు కూడా జన్మించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version