వైసీపీ ఎంపీగా బరిలోకి ప్రభాస్ పెద్దమ్మ ?

-

వైసీపీ ఎంపీగా బరిలోకి ప్రభాస్ పెద్దమ్మ ఉండనుందా…? అయితే..నర్సాపురం వైసీపీ అభ్యర్థిగా కృష్ణంరాజు భార్య కృష్ణంరాజు భార్య రాజకీయాల్లోకి వచ్చి నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేయాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. కృష్ణంరాజు జయంతి పేరుతో మొగల్తూరులో భారీ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లను ఆమె చూసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజకీయ ప్రకటన చేస్తానని ఆమె చెబుతున్నారు.

Shyamaladevi contesting as ycp mp

కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి కొద్ది రోజుల నుంచి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహంతోనే ఈసారి జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని భావిస్తున్నారు. కృష్ణంరాజు చనిపోయిన తర్వాత రెండో జయంతి ఇది. గతం కంటే భిన్నంగా భారీగా చేయాలనుకోవడం వెనుక రాజకీయం ఉందని భావిస్తున్నారు. ఇదే అంశంపై శ్యామలాదేవి కూడా స్పందించారు. 20వ తేదీన జయంతి కార్యక్రమం పూర్తయిన తర్వాత రాజకీయ అంశాలపై ప్రస్తావిస్తానని శ్యామలాదేవి అన్నారు. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఘనవిజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version