SHOCKING: ఫ్రెంచ్ ఓపెన్ లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి…!

-

తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ లో ఇండియా నుండి వెళ్లిన ఇద్దరు మేటి ఆటగాళ్లకు చుక్కెదురయ్యింది. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొన కిదాంబి శ్రీకాంత్ మరియు లక్ష్యసేన్ లు ఇద్దరూ ఓడిపోయి ఇంటిదారి పట్టారు. పూర్తి వివరాల ప్రకారం ఈ ఫ్రెండ్ ఓపెన్ లో పోటీపడిన కిదాంబి శ్రీకాంత్ మరియు లక్ష్య సేన్ లు మొదటి రౌండ్ లోనే ఓడిపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ముందుగా శ్రీకాంత్ ఫ్రాన్స్ కు చెందిన తోమా జూనియర్ పోపోవ్ చేతిలో 17 – 21 , 15 – 21 తేడాతో వరుస సెట్ లలో దారుణమైన ఓటమిని తెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్ కేవలం 44 నిముషాలలోనే ముగిసిపోయింది. ఇక మరో ఇండియా ఆటగాడు లక్ష్యసేన్ ఫ్రాన్స్ కె చెందిన ఆర్నాడ్ మెర్కెల్ చేతిలో 15 – 21 , 18 – 21 తేడాతో ఓడిపోయి మొదటి రౌండ్ లోనే ఇంటిదారి పట్టారు .

ఈ ఫలితాలు పారిస్ లో జరగనున్న ఒలింపిక్ గేమ్స్ క్వాలిఫికేషన్ కు ఇబ్బందిగా మారుతాయని తెలిసిన విషయమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version