IPL 2023 : సచిన్ కూతురు కోసం ముంబై ఇండియన్స్ లోకి గిల్ !

-

ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టు స్టార్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అప్ కమింగ్ సీజన్ లో గుజరాత్ తరపున ఆడలేనని చెప్పాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. శుబ్ మన్ గిల్ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించింది. తమ జట్టుతో కొనసాగినా అతని ప్రయాణం అద్భుతం అని ప్రశంసించింది.

‘శుబ్ మన్ నీ ప్రయాణం గుర్తించుకోదగినది. నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు శుబ్ మన్ సైతం లవ్ యు అని ఏమోజీ తో బదులిచ్చాడు.

అయితే అభిమానులు మాత్రం ఈ ప్రకటనను నమ్మడం లేదు. ఇది ప్రాంక్ అని పేర్కొంటున్నారు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ అయ్యే శుబ్ మన్ గిల్ ను గుజరాత్ టైటాన్స్ ఏమాత్రం వదులుకోదని, పైగా ఆ జట్టు టైటిల్ గెలవడంలో శుబ్ మన్ గిల్ కీలక పాత్ర పోషించాడని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాంకులు చాలా చూసామని బదిలిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ట్రేడింగ్ ద్వారా శుబ్ మన్ గిల్ ముంబై ఇండియన్స్ లోకి వెళ్లే అవకాశం ఉందని సందేహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news