సచిన్, కోహ్లీ రాలే.. సోనూ సూద్ వచ్చాడు.. ఆయనకి ప్రాణం పోశాడు..!

-

వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన సొంత ఖర్చులతో పంపించిన విషయం తెలిసిందే. అలాగే ఉపాధి కోల్పోయిన కార్మికులకు కూడా తానే ఉపాధి కలిపిస్తున్నాడు. అదేవిధంగా కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి కూడా సోనూసూద్ తన ఆపన్న హస్తాన్ని అందించారు. అలాగే కోరిన వారికి సాయం చేస్తూ.. ఈ కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తూ.. మానవత్వం చాటుకుని రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న సోనూసూద్ తాజాగా.. మరొకరికి నేనున్నానని అభయం ఇచ్చాడు.

సచిన్, కోహ్లీ లాంటి క్రికెటర్లకు బ్యాట్లు రిపేర్ చేసిన అష్రఫ్ భాయ్ కిడ్నీ ఆపరేషన్‌కు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు. ముంబై చెందిన ఈ అష్రఫ్ భాయ్ దీనగాధ గురించి ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. సోనూసూద్ స్పందించి అతడి అడ్రెస్ అడిగాడు. క్రికెటర్లు ఎవరూ అష్రఫ్‌ను పట్టించుకోకపోయినా.. సోనూసూద్ ముందుకు రావడం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version