SRH VS RCB మ్యాచ్‌..ఆర్టీసీ, మెట్రో అదిరిపోయే శుభవార్త

-

SRH VS RCB మ్యాచ్‌..ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. క్రికెట్ అభిమానులారా!? సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ మధ్య ఇవాళ జరిగే #IPL మ్యాచ్ ను వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి #TSRTC బస్సుల్లో ఇలా సులువుగా చేరుకోండని ప్రకటన చేసింది తెలంగాణ ఆర్టీసీ.

SRH VS RCB match RTC is full of good news

మీకోసమే Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసిందని తెలిపింది. ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే ట్రాఫిక్ తిప్పలు ఉండవు. సొంత వాహనాల్లో వెళ్తే పార్కింగ్ ఇబ్బందులుంటాయని వెల్లడించారు అధికారులు. కావున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. క్షేమంగా స్టేడియానికి చేరుకుని మ్యాచ్ ని వీక్షించండని ఆర్టీసీ తెలిపింది. అటు అర్థరాత్రి వరకు మెట్రో సేవలు కూడా ఉండనున్నాయి. కాగా…ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ లో SRH VS RCB మ్యాచ్‌ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version