రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. 20 రూపాయలకే భోజనం

-

Economy Meal Program-SCR Rs 20 Meals, Passengers: తూర్పుగోదావరి జిల్లాలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందింది. రాజమండ్రి రైల్వేస్టేషన్లలో 20 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఎకానమీ మీల్స్ పేరుతో 20 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారు.

Economy Meal Program-SCR Rs 20 Meals, Passengers

కేవలం 20 రూపాయలకే భోజనాన్ని అందిస్తూ రాజమండ్రి రైల్వే స్టేషన్ లో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేశారు అధికారులు. సామాన్య, మధ్యతరగతి రైల్వే ప్రయాణికులకు ఉపయుక్తంగా మారింది 20 రూపాయాల భోజనం. ప్రయాణికులకు ఎకానమీ మీల్స్ పేరుతో 20 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందుబాటులోకి తెచ్చింది ఐఆర్ సిటిసి. రైల్వేస్టేషన్ లో జనరల్ బోగీలు ఆగే చోట కౌంటర్ ను ఏర్పాటు చేసింది ఐఆర్ సిటిసి.

Read more RELATED
Recommended to you

Exit mobile version